- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
traffic police: ట్రాఫిక్ పోలీసులా.. మజాకా?.. అట్లుంటది డెడికేషన్..
దిశ వెబ్ డెస్క్: భారత దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గంటకు 19 మంది చనిపోతున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్తూ ప్రమాదాలకు గురికావడం కారణంగానే చనిపోతున్నవారి సంఖ్య అధికంగా ఉందని తాజా నివేధికలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా దరించాలనే రూల్ తీసుకు వచ్చింది.
ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ దరించకుండా బండి నడిపితే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూల్ ట్రాఫిక్ పోలీసుకు వరంగా మారింది. ట్రాఫిక్‌లో డ్యూటీ చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పేరుతో లూటీ చేస్తున్నారు. హెల్మెట్ దరించినా కొందరు ట్రాఫిక్ పోలీసులు చలాన రాస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హెల్మెట్ దరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహన దారుడికి ఫైన్ వేశారు. పోలీసులు చేసిన ఈ పనికి ప్రజలు విస్తుపోయేలా చేస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియే సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతోంది.