- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పార్టీ పై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్రముఖ మీడియా చానెల్ నిర్వహించిన డిబెట్ లో పాల్గొన్న బీజేపీ నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక అధికారంలోకి వచ్చిన మొదటి ఐదు సంవత్సరాలు బాగానే పరిపాలించారని, దీంతో రెండో సారి కూడా ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. కానీ రెండో సారి అధికారంలోకి వచ్చాక పరిపాలనలో పూర్తి మార్పులు వచ్చాయని, కుటుంబ పరిపాలనను తీసుకొచ్చారని, రాచరిక పాలనను మరిచేలా తాను ఏది అనుకుంటే అదే చేశారని, మంత్రులకు కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా పాలించారని ఆరోపించారు.
అంతేగాక తన ఎమ్మెల్యేలకు దగ్గరకు రానివ్వకుండా గంజిలో ఈగలాగా తీసివేశారని, ప్రజలను కలవకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాటలతో కాలం గడిపారని విమర్శలు చేశారు. మొన్న ఓడిపోయే ముందు కేసీఆర్ 3 గంటల పాటు ఇచ్చిన ఉపన్యాసంలో, అంతకుముందు కేటీఆర్, హరీష్ రావు ఇచ్చిన ఉపన్యాసాలు వింటే ఈ విషయాలు మీకు స్పష్టంగా అర్ధం అవుతాయన్నారు. దేశంలో తెలంగాణ అన్నింటిలో నంబర్ 1 అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో భారీ ఫెక్సీలు కూడా ఏర్పాటు చేసిన కేసీఆర్ ఎట్ల పతనం అయిపోయారో ప్రజలు చూశారని, కేసీఆర్ అక్రమాలు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించే ప్రసక్తి లేదని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఈటెల అన్నారు.