కంటోన్మెంట్ ప్రజలకు ఈటల రాజేందర్ కీలక హామీ

by GSrikanth |
కంటోన్మెంట్ ప్రజలకు ఈటల రాజేందర్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కిషన్ రెడ్డితో కలిసి సికింద్రాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని పదేళ్ల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. తాము గెలిచిన వెంటనే ఇళ్ల సమస్యలను పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. వేసవి వేళ కంటోన్మెంట్ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినాక ప్రజల అవసరాలకు రిజర్వాయర్ నిర్మి్స్తామని కీలక హామీ ఇచ్చారు. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి కృషి చేస్తామని తెలిపారు. కంటోన్మెంట్‌లో కేంద్రం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని వెల్లడించారు. కంటోన్మెంట్ అభివృద్ధి కేవలం కేంద్రంతోనే సాధ్యమన్నారు.

Advertisement

Next Story