- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Etela Rajender: కేసీఆర్‌ను దెబ్బ కొడితే దిమ్మతిరిగింది.. ఎంపీ ఈటెల సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సర్కార్ పేదల కళ్లలో మట్టి కొడుతోందని, కేసీఆర్ కూడా ఇలాగే విర్రవీగి ఏమయ్యాడో చూశారని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట గ్రామంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యమానికి హాజరైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న పాపానికి హైదరాబాద్‌లోని పేదలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా ఎంతమంది పేదల కళ్ళలో మట్టి కొడుతుందని, ఎంతమంది జీవితాలను బుగ్గిపాలు చేస్తుందని మండిపడ్డారు. అలాగే దీనికి మూల్యం చెల్లించక తప్పదని, నీయబ్బ జాగీరా అని అడుగుతున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా ఇలానే విర్రవీగాడని.. చివరికి ఏమయ్యాడో చూశారని, దెబ్బ కొడితే దిమ్మ తిరిగిందని అన్నారు. ఇక పేదల బ్రతుకుల్లో మట్టి కొడితే వారి ఉసురు తగలకుండా పోదని ఈటెల హెచ్చరించారు.