- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ సర్కారుపై ఈటల సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి సర్కారుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణల చేశారు. వరంగల్ హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. హైదరాబాద్‌లో బిల్డింగ్ కట్టుకోవాలి అంటే స్క్వేర్ ఫీట్‌కి రూ. 75 లంచం కట్టాలని డిసైడ్ చేశారని ఆరోపించారు. అతితక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులను రేవంత్ రెడ్డి వసూలు చేశారన్నారు. కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తున్నారని.. ప్రజలు బిక్ష పెడితే పదవి వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు.
ఈ విషయం మర్చిపోతే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. పెద్దని అని మోడీని పొగిడి మళ్లీ అదే నోటితో హంతకుడు అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని అది నోరా లేక తాటి మట్టనా అని సీరియస్ అయ్యారు. కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని.. పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోడీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి టీచర్ల, నిరుద్యోగుల, కాలేజీల, స్కూల్స్ సమస్యలు గుర్తుకు వస్తాయని ఈటల ఎద్దేవా చేశారు. రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీ ఉందని చెల్లించే నిజాయితీ ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్షల మంది పిల్లల ఫీజులు చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రి యారిటీనా.. కాంట్రాక్టర్స్‌కి బిల్లులు చెల్లించడం ప్రియరిటీనా ? అని క్వశ్చన్ చేశారు. చిత్తశుద్ది ఉంటే ఫీజు బకాయిలు చెల్లించి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.