- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బీజేపీకి 10 నుంచి 12 MP సీట్లు ఖాయం: ఈటల రాజేందర్
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 10 నుంచి 12 సీట్లు రావడం ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు అనేక అవమానాలు, తలదించుకునే పనులతో తెలంగాణ కుంగిపోయిందని పేర్కొన్నారు. ఆరు మాసాల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. కాలిపోతున్న మోటార్లు, ఎండిపోయిన పంటలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలపై బుకాయించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్ళీ జనరేటర్లు అవసరమయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారిందన్నారు. ఎగ్జిట్ పోల్స్ పైనా ఈటల స్పందించారు. మూడు రోజుల్లో ఫలితాలు రానున్నాయన్నారు. దేశంలో బీజేపీకి, మిత్ర పక్షాల కూటమి 350-370 సీట్లు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువగా ఊహించని స్థాయిలో సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్‌పై పార్టీ నేతలు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారితో చర్చించామని వెల్లడించారు.