- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియా పోస్టులకు ఎవరూ స్పందించ వద్దు: ఈటల రాజేందర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి వీరే కారణం అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారడం పై మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో కొంతమంది చిల్లరగాళ్ళ.. పిచ్చి పోస్టులకు నా అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దని ట్విట్టర్ ద్వారా కోరారు. ఈటల తన ట్వీట్ లో.. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి నాయకునికి, కార్యకర్త కి హృదయపూర్వక అభినందనలు.
ప్రతికూల పరిస్థితుల్లో కూడా 16% శాతం ఓట్లు 8 సీట్లు గెలిచాం. 19 సీట్లలో రెండవ స్థానంలో నిలిచాం.. దానిని స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. మనలని బలహీనపరచడానికి, అనైక్యత సృష్టించి లాభం పొందాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళ ట్రాప్ లో మనం పడవద్దు. మన లక్ష్యం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి అందించడం కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దాం అని రాసుకొచ్చారు.