- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు: మంత్రి కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరానికి నియమించుకోనున్నట్లు సంస్ధ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఐఓ అంథోని మేక్ కార్తీతో కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాదులో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసే టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగానికి అద్భుతమైన ఊతం లభిస్తుందన్నారు.
ఈ రంగంలో హైదరాబాద్ నగరంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలిపారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ప్రపంచంలో 70 దేశాలలో ఫైనాన్షియల్ మార్కెట్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తుందని, దాదాపు 190 దేశాలలోని తన ఖాతాదారులకు సేవలను అందిస్తుందన్నారు. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవారంగంలో దిగ్గజ సంస్ధగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఒకటిగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్, ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.