- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మళ్లీ పెండింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కసరత్తు మళ్లీ పెండింగ్ లో పడిందా! కొన్ని రోజులు హడావుడి చేసిన సర్కారు.. ఆ ప్రక్రియను మధ్యలోనే ఆపేసిందా! గైడ్ లైన్స్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నదా! అంటే అవుననే సమాధానమే వస్తున్నది. దీంతో హెల్త్ కార్డులతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందడానికి మరికొంత కాలం నిరీక్షించక తప్పదని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల్లో విధి విధానాలపై పక్షం రోజుల క్రితం హెల్త్ మినిస్టర్ హరీశ్ రావుతో ఉద్యోగ సంఘాల లీడర్లతో చర్చలు జరిపారు. దీంతో సమస్య కొలిక్కి వస్తుందని ఎంప్లాయీస్ ఆశపడ్డారు. కాని స్కీమ్ లో ప్రభుత్వ వాటా, విధివిధానాలపై క్లారిటీ రాకపోవడంతో ఈ ప్రక్రియ మళ్లీ పెండింగ్ లో పడినట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ వాటాపై అనుమానాలు
ప్రతి నెల ఉద్యోగులు చెల్లించే వాటాతో సమానంగా ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ప్రతి నెల హెల్త్ స్కీమ్స్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే సమస్యలు వస్తాయి. కొన్ని నెలల పాటు ప్రభుత్వం సవ్యంగా చెల్లించి ఆ తర్వాత చేతులెత్తేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అనే అనుమానాలు ఉద్యోగవర్గాల్లో ఉన్నాయి. ఈ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారా? లేకపోతే పైనాన్స్ సెక్రటరీకే పూర్తి స్వేచ్ఛ ఇస్తారా?అనే క్లారిటీ కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు.
వెంటాడుతున్న చేదు అనుభవం
ఉద్యోగుల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా హెల్త్ సర్వీస్ అందిస్తుందని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ మేరకు హెల్త్ కార్డ్స్ జారీ చేశారు. మొదట్లో అంతా సవ్యంగానే జరిగింది. కానీ 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలైంది. చేసిన ట్రీట్మెంట్ కు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. సంవత్సరాలుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో హెల్త్ కార్డుల ద్వారా చికిత్స చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలకే స్పష్టత కరువు
హెల్త్ స్కీమ్ లో గైడ్ లైన్స్ ఎలా ఉండాలి? ఏ ఉద్యోగి ఎంత మేరకు వాటా చెల్లించాలి? ఎక్కువ వాటా చెల్లించిన వారికి ప్రత్యేక సౌకర్యాలు ఇస్తారా? అనే అంశాలపై ఎంప్లాయీస్ లీడర్లకే స్పష్టత లేదని సమాచారం. ఉద్యోగుల వాటా కింద మూల వేతనంలో ఒక్క శాతం ఇచ్చేందుకు ఎంప్లాయీస్ లీడర్లు ఒప్పుకున్నారు. కానీ అందరి మూల వేతనం ఒకే తీరుగా ఉండదు. హోదాల ప్రకారం ఉంటుంది. మరి అందరి నుంచి ఒక శాతం వసూలు చేయడం సరికాదనే వాదనలూ ఉన్నాయి.
మౌనంగా హెల్త్ మినిస్టర్
సుమారు పక్షం రోజుల క్రితం ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్ పై సమావేశం నిర్వహించిన మంత్రి హరీశ్ రావు ఆ తర్వాత అ ఆంశాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. క్రమం తప్పకుండా ప్రభుత్వ వాటా చెల్లించే విషయంలో ఎలాంటి మెకానిజం ఉంటుందనే దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అలాగే గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి? అనే అంశాన్ని కూడా ఆయన పట్టించుకోవట్లేదని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి : బీఆర్ఎస్‌తో వామపక్షాల దోస్తీ కటీఫ్.. దానికి కేసీఆర్ ఒప్పుకోరని ముందే ఫిక్స్ అయ్యారా?