'విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

by GSrikanth |
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం మింట్ కాంపౌండ్ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ సంఘాల నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుదని మండిపడ్డారు.

ఉద్యోగుల పీఆర్సీ‌పై వెంటనే ప్రకటన చేయాలని, ఈపీఎఫ్, జీపీఎఫ్, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. యాజమాన్యం ఎటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. త్వరలో జేఏసీ ద్వారా కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story