వర్షాల ఎఫెక్ట్: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్ రెడ్డి కీలక పిలుపు

by GSrikanth |   ( Updated:2023-07-21 05:18:00.0  )
వర్షాల ఎఫెక్ట్: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్ రెడ్డి కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలో పాలు పంచుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయని ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఇళ్లలోకి నీరు చేరి, వరదలతో ముంపునకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెంటవెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story