- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యలకు నిలయంగా ఉన్నాయని, పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంకు విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ.. సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థుల చదువులకి ఇబ్బందులు కలుగుతూ విద్యా ప్రమాణాలు పెరగడం లేదన్నారు. ఎంఈవో, డీఈవోలు కూడా ఇంఛార్జీలుగా ఉండటం వల్ల ప్రభుత్వ విద్య మెరుగుపడటం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవని రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్లు అద్దె భవనల్లో కొనసాగుతున్నాయని, మెస్ ఛార్జీలు పెరగకపోవడం మూలంగా అనేక హాస్టళ్లలో కాంట్రాక్టర్లు నాసికరమైన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారని తెలిపారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం జనవరి 6న పాఠశాలలో విరుద్ధంగా ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించారని, ఇది సరైన విధానం కాదని ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ స్పష్టం చేశారు. పాఠశాలలో విద్య, వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించకుండా రాజకీయ లబ్ధి కొరకు, రాజకీయ ఎదుగుదల కొరకు మతపరమైన కార్యక్రమం నిర్వహించారని మండిపడ్డారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించకుండా మతపరమైన కార్యక్రమం నిర్వహించడం ఎంటని ప్రశ్నించారు. పాఠశాలలో పీఠాధిపతులతో మత పరమైన కార్యక్రమాలు నిర్వహించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Tags
- AISF leaders