హైదరాబాద్‌లో 11 చోట్ల ఈడీ సోదాలు.. పేద పిల్లల పేరుతో రూ.300 కోట్ల విరాళాలు స్వాహా!

by Prasad Jukanti |
హైదరాబాద్‌లో 11 చోట్ల ఈడీ సోదాలు.. పేద పిల్లల పేరుతో రూ.300 కోట్ల విరాళాలు స్వాహా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఆపరేషన్ మొబిలిటీ (ఓఎమ్) అనే చారిటీ సంస్థపై ఈడీ రెయిడ్స్ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 11 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్ లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోదాలు ఈ నెల 21,22 తేదీలలో నిర్వహించినట్లు ఈడీ మంగళవారం తెలిపింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. యుఎస్ఎ, కెనడా, యుకె, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లాండ్, మలేషియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రొమేనియా, సింగపూర్, స్వీడన్ స్విజ్జర్ ల్యాండ్ వంటి 16 దేశాల్లో భారీ ఎత్తున ఓఎమ్ చారిటీ సంస్థ విరాళాలు సేకరించింది. అనాథలు, పేదల పిల్లలకు ఉచిత విద్య, భోజనం అందిస్తామని, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని విదేశీ దాతల నుండి రూ.300 కోట్లు సేకరించారని ఈడీ పేర్కొంది. విదేశాల నుంచి సేకరించిన విరాళాలు పక్కదారి పట్టించడం ద్వారా దుర్వినియోగం చేసినట్లు తమకు సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. కాగా తెలంగాణతో పాటు ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed