- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Kiran Abbavaram: అది నిజమని నిరూపిస్తే.. సినిమాలు మానేస్తా.. యంగ్ హీరో సంచలన కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’(Ka). సుజీత్(Sujith), సందీప్(Sandeep) ఇద్దరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. చింతా వరలక్ష్మి(Chinta Varalaxmi) సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి(Chinta Gopala Krishna Reddy) నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. నయన్ సారిక(Nayan Sarika), తన్వి రామ్(Thanvi Ram) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, రెండు పాటలు, ట్రైలర్ అలరించాయి. ఇక ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల చేస్తామని ఫస్ట్ ప్రకటించిన మూవీ టీమ్.. ప్రజెంట్ తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమా డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల జోరులో ఉన్నారు చిత్ర బృదం. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “వాసుదేవ్ అనే వ్యక్తి కథ ఇది. అతనొక అనాథ. పక్కవారి లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువ. వేరే వాళ్ల లెటర్స్ చదువుతూ వాళ్ల ఎమోషన్స్‌ను ఆస్వాదిస్తాడు. పోస్ట్ మ్యాన్ అయ్యాక కృష్ణ గిరి అనే విలేజ్‌కు వెళ్తాడు. మరి అక్కడికి వెళ్లాక ఏం జరింగిందన్నది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి కథ ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ అలా వచ్చిందని నిరూపిస్తే సినిమాలు మానేస్తా. నా వాసుదేవ్ పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా నన్ను కొత్తగా చూస్తారు” అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.