- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: కవిత లీగల్ టీమ్‌కు ఈడీ పిలుపు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ వరుసగా రెండవ రోజు కవితను విచారిస్తోన్న ఈడీ అధికారుల బృందం.. దాదాపు ఏడున్నర గంటలకు పైగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దర్యాప్తు సంస్థ ఈడీ కవితను విచారిస్తోన్న సమయంలోనే ఆమె లీగల్ టీమ్‌ను ఈడీ కార్యాలయానికి పిలిచారు.
ఈడీ పిలుపు నేపథ్యంలో కవిత న్యాయవాది సోమా భరత్ కుమార్, బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అధికారులు అడిగిన డ్యాక్యుమెంట్లను వారు తీసుకొచ్చినట్లు సమాచారం. కవిత లీగల్ టీమ్‌ను ఈడీ కార్యాలయానికి పిలవడం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ కవిత అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్రచారం జరగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. సమయం గడిచే కొద్ది ఏం జరుగబోతోందో అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.