కాంగ్రెస్ ఎమ్మెల్యే, HCA మాజీ అధ్యక్షుడు వినోద్‌కు ఈడీ నోటీసులు

by Mahesh |   ( Updated:2023-12-30 06:38:17.0  )
కాంగ్రెస్ ఎమ్మెల్యే, HCA మాజీ అధ్యక్షుడు వినోద్‌కు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్‌లో 20 కోట్ల రూపాయల అక్రమాలపై ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే HCA అధ్యక్ష, కార్యదర్శలను ఈడీ అధికారులు విచారించారు. అలాగే ఈ కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే HCA మాజీ అధ్యక్షడైన ఎమ్మెల్యే వినోద్ జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియంలో నిర్మాణంలో అవినీతి జరిగిందని తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో దాఖలు చేసిన ఛార్జీషీట్ ఆధారంగా గతంలో వీరి ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, కీలక ఆధారాలు సేకరించారు. కాగా గతంలో గడ్డం వినోద్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు.

Advertisement

Next Story