- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పొలిటికల్ గేమ్‌గా ‘‘కవిత’’ ఎపిసోడ్.. అడ్వాంటేజ్‌గా మల్చుకునేందుకు బీజేపీ, BRS పోటాపోటీ ప్లాన్స్!
దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ విచారణ ఎలా ఉన్నా.. బీజేపీ, బీఆర్ఎస్‌లు దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలకు ఈ ఇష్యూ పొలిటికల్ అస్త్రంగా మారనున్నది. కవితను ఈడీ ఎంక్వయిరీకి పిలవడంతోనే తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం, ఈడీ సెంట్రల్ ఆఫీసు దగ్గర, తెలంగాణభవన్ ప్రాంగణంలో శనివారం గులాబీ శ్రేణులు హడావుడి సృష్టించాయి.
బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం
కవితపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ దీన్ని సెంటిమెంట్ అస్త్రంగా మల్చుకుంటున్నది. హైదరాబాద్ నగరం మొదలు రాష్ట్రమంతా నిరసనలు చేపట్టింది. పోలీసుస్టేషన్లలో మహిళా నేతలు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సైతం బండి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.
పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇకపైన సంజయ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందలేదని, హాజరు కావాలని ఆదేశించినట్లయితే తప్పకుండా వెళ్తానని, తగిన వివరణ ఇస్తానని బండి సంజయ్ సైతం క్లారిటీ ఇచ్చారు. ఈడీ ముందు కవిత హాజరైన అంశానికి రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ వచ్చేలా, ప్రజల దృష్టికిలోకి వెళ్లేలా బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం కార్యాచరణను అమలుచేసింది.
దృష్టి మళ్లించేందుకే జంతర్ మంతర్ దీక్ష
లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరయ్యే అంశాన్ని దృష్టి మళ్లించేందుకే కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చి జంతర్‌మంతర్ దీక్ష చేపట్టినట్టు బీజేపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన మొదలు అమలు వరకు సౌత్ గ్రూపు పేరుతో కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడ్డారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి చార్జిషీట్లలో వీటినే పేర్కొన్నాయని బీజేపీ నేతలు గుర్తుచేశారు.
ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయాలని ఎవరు చెప్పారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై వేధింపులు మొదలుపెట్టిందనే రాగాన్ని బీఆర్ఎస్ నేతలు, కవిత అందుకున్నారని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ తలవంచదు’ అంటూ కవిత చేసిన కామెంట్‌కు బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. తప్పు చేసింది కవిత అయినప్పుడు తెలంగాణ సమాజం ఎందుకు తల వంచుతుందని ప్రశ్నించారు.
పరస్పర విమర్శలు
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తున్నదని, కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడిందని, ఎప్పటికైనా జైలుకు పోక తప్పదని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పలుమార్లు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైతం లిక్కర్ దందా, డ్రగ్స్ దందా, కమిషన్ల దందా అంటూ వేర్వేరు సందర్భాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులపై కామెంట్లు చేశారు. తప్పుచేసినప్పుడు చట్టపరంగా శిక్షలు తప్పవని, దర్యాప్తు సంస్థలు ఆ పనే చేస్తున్నాయన్నారు. దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ సైతం విపక్షాలను టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నదని రియాక్ట్ అయింది.
కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌తో బండి సంజయ్ కామెంట్లను మూడు రోజుల తర్వాత హైలైట్ చేస్తూ సెంటిమెంట్ రూపంలో బీఆర్ఎస్ వాడుకున్నది. బీజేపీ సైతం ఆ ఇష్యూను పొలిటికల్ అడ్వాంటేజీగా మల్చుకుంటున్నది. రానున్న కాలంలో దర్యాప్తు ప్రక్రియ ద్వారా చోటుచేసుకునే పరిణామాలను సైతం ఈ రెండు పార్టీలూ రాజకీయ అస్త్రంగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి.