రాష్ట్రంలో లగ్జరీ కార్లు కొన్న వారికి ఈడీ బిగ్ షాక్!

by Sathputhe Rajesh |
రాష్ట్రంలో లగ్జరీ కార్లు కొన్న వారికి ఈడీ బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడీ తెలంగాణలో ఆపరేషన్ మాంటేకార్లో చేపట్టడం సంచలనంగా మారింది. లగ్జరీ కార్లు కొని ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్లపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2021 ఆపరేషన్ మాంటేకార్లో మొదలుకాగా కోట్ల విలువ చేసే కార్లను దిగుమతి చేసుకున్న వాళ్లపై నజర్ పెట్టింది. కొంత మంది బినామీ పేర్లతో కార్లు కొనుగోలు చేసి భారీగా ట్యాక్స్ ఎగవేతకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. అలాంటి వారిని తాజాగా మరోసారి గుర్తించి ఈడీ నోటీసులు ఇచ్చింది. చికోటి ప్రవీణ్, మోసిన్, నజీర్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed