BREAKING: పథకాలకు ఈసీ బ్రేక్.. హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు

by Disha Web Desk 19 |
BREAKING: పథకాలకు ఈసీ బ్రేక్.. హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ అడ్డుకోవడంతో మహిళ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. లంచ్ మోషన్ కింద హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణ చేయనుంది. దీంతో కోర్టు తీర్పుపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రస్తుతం రన్నింగ్‌లో పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. వైసీపీ గవర్నమెంట్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ఈసీ.. పథకాల అమలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. లబ్ధిదారుల పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story

Most Viewed