- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం’ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల స్ట్రాంగ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని దాని వల్లే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలవగలిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలు, వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ కు బలం ఉంటే అధికార పార్టీ హోదాలో ఉండి, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి కూడా రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి, సొంత జిల్లా మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. కాంగ్రెస్ ప్రభుత్వ ఇ్చచిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమలు చేసేలా సర్కార్ పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తామెక్కడా చెప్పలేదన్నారు. వాళ్లంతట వారే కొట్లాట పెట్టుకుని, పాలించే సత్తా లేకుండా పోతే మేము ఏం చెప్పలేమన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత నెరవేర్చకుంటే ప్రజలే బండకేసి కొడతారన్నారు. ప్రజలను వంచిస్తే ఏం జరుగుతుందో ఏపీలో ఏం జరిగిందో కళ్లారా చూశామన్నారు. ప్రజలను మోసం చేయాలనుకునే వారు మట్టికరుచుకుపోతారని హెచ్చరించారు.
ఎలాంటి రాజకీయ వారసత్వం లేకన్నా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం గొప్ప విషయం అన్నారు. అవినీతి, స్కామ్ లు లేని ప్రభుత్వం కోసమే ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. రాముడి పేరు మీద రాజకీయం చేశామనేది అబద్దమని ఖండించారు. చేసిన అభివృద్ధి పనులపై తాము ఓట్లుఅడిగామన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది వెకిలి మాటలను అని కొట్టిపారేశారు. అబ్ కీ పార్ చార్ సౌ పార్ అనే నిదానం బీజేపీ నేతలు ఇచ్చింది కాదని మోడీ పరిపాలన నచ్చి, మెచ్చి ప్రజలు ఇచ్చారన్నారు.