- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లుక్ మార్చిన ఈటల.. మరి ఫేట్ మారేనా? టికెట్ కోసమేనంటా (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడీ మొదలైంది. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మెజార్టీ గెలుపే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో ఉన్న హేమాహేమీలు ఓడిపోయారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, రఘునందన్ రావు లాంటి వారు ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చిన బీజేపీ పార్టీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అయిన పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతుంది.
లోక్ సభ ఎన్నికల్లో ఈటల స్టంట్!
హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన బీజేపీ నేత ఈటల రాజేందర్.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల సరికొత్త వ్యూహానికి తెరతీశారని పార్టీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన లుక్ మార్చారు. ఎక్కువగా తెల్ల చొక్కాలు ధరించే ఈటల.. మోడీ టైప్ జాకెట్ (సద్రి) ధరించి.. నిన్న ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దీంతో ఈటల న్యూ లుక్‌పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఢిల్లీ పోవాలంటే భాష, వేషం మార్చాలి
ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని నెటిజన్లు కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. కోర్టు వేసిన ప్రతి ఒక్కరు నేషనల్ లీడర్ అవ్వలేరని విమర్శిస్తున్నారు. ఢిల్లీ పోవాలంటే భాష, వేషం మార్చాలి.. బానిసత్వం, నెక్ట్స్ సెంట్రల్ మినిస్టర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే లుక్ మారింది.. మరి ఫేట్ మారుతుందా..? లోక్ సభ ఎన్నికల కోసమే ఈ స్టంట్ లు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా, ఈ లోక్ సభ ఎన్నికల్లో ఈటల మాత్రం మల్కాజ్గిరి, లేదా మెదక్ నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.