- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delhi Elections: 25 ఏళ్ల తర్వాత బీజేపీ గెలవబోతుంది.. ఎన్నికల ప్రచారంలో ఈటల కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly election 2025) ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) పాల్గొన్నారు. ఆదివారం గోండా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అజయ్ మహావర్‌ను గెలిపించాలని, డిల్లీలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీకి మరింత బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం అందరూ ఇంట్లోనే ఉంటారని మీ ఇంటికి వచ్చాను.. అంటూ కర్తాల్ నగర్ స్థానికులతో మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక్కడ సీఎం 16 నెలలు జైల్లో ఉన్నారని గుర్తుకు చేశారు. ఢిల్లీలో 25 ఏళ్ల తర్వాత బీజేపీ గెలవబోతుందని, అందరూ మద్దతు తెలపాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎంత కష్టపడుతున్నారనేది అందరికీ తెలుసన్నారు.
తాను తెలంగాణ మొదటి ఆర్థిక మంత్రిని అని, తనకు బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పగా ఉందని, ఢిల్లీలో ఉండే ఎక్కువ మంది మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెండు రోజులు సమయం ఇచ్చి బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు.