మహానగరం హైదరాబాద్‌లోను భూకంపం.. ఈ ప్రాంతాల్లో ప్రకంపణలు

by Mahesh |
మహానగరం హైదరాబాద్‌లోను భూకంపం.. ఈ ప్రాంతాల్లో ప్రకంపణలు
X

దిశ, వెబ్ డెస్క్: బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రాన్ని స్వల్ప భూకంపం కుదిపేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రంగా.. 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో ప్రకంపణలు వచ్చాయి. అలాగే మహానగరం అయితే హైదరాబాద్ లో కూడా స్వల్పంగా 3 నుంచి 5 సెకన్లపాటు భూ ప్రకంపణలు వచ్చాయి. అయితే చాలా మందికి ఈ ప్రకంపణలు వచ్చినట్లు కూడా తెలియకపోవడంతో.. వేరే ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు పసిగట్టిన ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాగా ఎన్ఎస్సీ రిపోర్టు ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో.. కిస్మాత్ పుర, గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, మధురానగర్, ఎస్పార్ నగర్, గ్రాండ్ అయోధ్య హోటల్, అత్తాపూర్, చిక్కడపల్లి, గౌలిదొడ్డి తో పాటు హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్, సరూర్ నగర్, యూసుఫ్ గూడ, లాలాపేట్, బీఎన్ రెడ్డి, మియాపూర్, మేడ్చల్, ఖైరతాబాద్, ఇబ్రహింపట్నం, శేరిలింగంపల్లి, దిల్‌షుక్‌నగర్, శామీర్ పేట ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే సమయానికి.. ప్రకంపణలు ఆగిపోయాయి. దీంతో ప్రజలు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed