'E-Shram': కార్మికులకు వరంగా ‘ఈ-శ్రమ్’.. రూ.2 లక్షల ప్రమాద బీమా

by Shiva |
E-Shram: కార్మికులకు వరంగా ‘ఈ-శ్రమ్’.. రూ.2 లక్షల ప్రమాద బీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం ‘ఈ శ్రమ్-యోజన’ స్కీమ్ ను అమలు చేస్తున్నది. ఈ కార్డు కార్మికులకు వరంగా మారనున్నది. ఈ శ్రమ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి అనేక ప్రయోజనాలను కేంద్రం కల్పిస్తున్నది. దేశంలో కోట్లాది మంది కార్మికులు భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారు. ఏళ్ల 'E-shram': కార్మికులకు వరంగా ‘ఈ-శ్రమ్’.. రూ.2 లక్షల ప్రమాద బీమాతరబడి పని చేస్తున్నా వీరికి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. ఇలాంటి శ్రమ జీవుల భవిష్యత్ భద్రత, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాల కోసం రేషన్ కార్డుతో ఈ-శ్రమ్ కార్డును అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో 42,91,138 కార్డులు

కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో ఈ శ్రమ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ లో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులని కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రంలో ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 2024 నవంబర్ నాటికి 42,91,138 మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2025 నాటికి కోటి రిజిష్ట్రేషన్లు దాటేలా కార్మిక శాఖ దృష్టి సారించనుంది. దేశ వ్యాప్తంగా 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర కార్మిక భీమా సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

ఈ-శ్రమ్ కార్డు‌తో ప్రయోజనాలు

* ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే రూ. 2లక్షలు

* మరణిస్తే కుటుంబసభ్యులకు రూ. 2లక్షలు

* పాక్షిక వికలాంగత్వానికి రూ. లక్ష

* 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్

* కార్మికులకు పని ముట్లు, కుట్టు మిషన్లు, కార్మికుల పిల్లలకు ఉచిత సైకిళ్లు, ఇతర ఆర్థిక సహాయాలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..

https://eshram.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేసి ఆధార్‌తో లింక్ చేసిన సెల్ ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన అనంతరం ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. స్క్రీన్‌పై అడిగిన వ్యక్తిగత డేటా, అడ్రస్, విద్యా విషయాలు ఎంటర్ చేయాలి. చేస్తున్న పని గురించి వివరాలు తెలియజేయాలి.

Advertisement

Next Story