Drunk man with national flag: నీ దేశభక్తి తగలెయ్యా.. మద్యం మత్తులో జాతీయ జెండాతో సెల్ టవర్ పై వ్యక్తి హల్ చల్

by Prasad Jukanti |   ( Updated:2024-08-28 11:21:54.0  )
Drunk man with national flag: నీ దేశభక్తి తగలెయ్యా.. మద్యం మత్తులో జాతీయ జెండాతో సెల్ టవర్ పై వ్యక్తి హల్ చల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాండూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన సదరు వ్యక్తి అక్కడ తలకిందులుగా జాతీయ జెండాను ఎగరవేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. చివరకి పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో అతడు కిందకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూస్తున్న వారంతా ఇదెక్కడి దేశభక్తిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story