Drug Gang Arrested: డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. 254 కిలోల గంజాయి స్వాధీనం, ఐదుగురు అరెస్ట్

by Shiva |
Drug Gang Arrested: డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. 254 కిలోల గంజాయి స్వాధీనం, ఐదుగురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా, ఐదురుగు సభ్యులతో కూడిన డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 254 కిలోల గంజాయితో పాటు 2 కార్లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.కోటి విలువైన గంజాయి ఇతర వస్తువులను సైతం సీజ్ చేశారు. అరకులో గంజాయిని కొనుగోలు చేసి ముంబాయి, ఉత్తర్ ప్రదేశ్‌కు సరుకును ముఠా అక్రమంగా తరలిస్తు్న్నారు. ఐదేళ్లుగా ఏపీ నుంచి యూపీకి గంజాయి సరఫరా సాగుతున్నట్లుగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇక గంజాయి తరలింపునకు నిందితులు రెండు కార్లను వినియోగిస్తున్నట్లుగా దర్యాప్తులో తెలిందని పేర్కొన్నారు.

ముందు ఒక పైలెట్ వాహనం వెళ్లి చెకింగ్ పాయింట్లు గమనించి సరుకు ఉన్న వాహనానికి సమాచారం ఇస్తూ గంజాయిని తరలించే వారని తెలిపారు. క్లియర్ రూట్లలో మాత్రమే గంజాయి ఉన్న కారు వెళ్తుందని, ఆ తరువాత కొంతదూరం వెళ్లాక గంజాయిని మరో కారులోకి మారుస్తుంటారని విచారణలో తేలింది. అలా ఓఆర్ఆర్‌పై గంజాయిని మరో కారులోకి మారుస్తుండగా ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీసీపీ శ్రీనివాస్ వివరించారు. నిందితుల్లో ఇద్దరు యూపీ, మరో ముగ్గురు ముంబై వాసులు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో సచిన్ సింగ్, నదీమ్, సక్లెయిన్, సలీం, ప్రశాంత్ సింగ్‌లు ఉన్నారు. అందులో సచిన్ సింగ్ వద్ద ఓ తుపాకీ, బుల్లెట్లు కూడా లభ్యం అయ్యాయని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed