- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో ప్రియురాలు లావణ్య అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల MDMA ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలిసింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆమెపై NDPS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇప్పటికే మోకిలా పీఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా గుర్తించారు. సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం లావణ్యను రిమాండ్‌కు తరలించారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ నివారణపై ఫోకస్ పెంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ కేసులో ఎవరెవరి హస్తం ఉందో విచారణలో తెలియనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.