ప్రగతిభవన్లో ప్రకాష్ అంబేద్కర్.. సన్మానించిన సీఎం కేసీఆర్

by Javid Pasha |   ( Updated:2023-04-14 10:36:41.0  )
ప్రగతిభవన్లో ప్రకాష్ అంబేద్కర్.. సన్మానించిన సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : డా.బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఆవిష్కరిస్తున్న.. ప్రపంచంలోనే అతి పెద్దదయిన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవుతున్న.. బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, లోక్ సభ మాజీ సభ్యులు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు చేరుకున్న ప్రకాశ్ అంబేద్కర్ ని సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో ఘనంగా సత్కరించి పూలగుచ్చమందించారు.

అనంతరం వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం భోజనంతో వారికి అతిథ్యమిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీనేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్న ధోంగే, సిద్దోజీరావు తదితరులున్నారు.

Advertisement

Next Story