ప్రీతి సూసైడ్ ఎఫెక్ట్: డాక్టర్ నాగార్జునరెడ్డి‌పై సర్కార్ బదిలీ ​వేటు

by Satheesh |   ( Updated:2023-03-02 16:59:42.0  )
ప్రీతి సూసైడ్ ఎఫెక్ట్: డాక్టర్ నాగార్జునరెడ్డి‌పై సర్కార్ బదిలీ ​వేటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజీఎం అనస్థిషియా డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ, డాక్టర్ నాగార్జునరెడ్డి‌పై సర్కార్​వేటు వేసింది. గురువారం భూపాలపల్లి మెడికల్ కాలేజీకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ సైఫ్‌ వేధింపులపై ప్రీతి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన సూచన మేరకు సైఫ్‌, ప్రీతిని పిలిచి నాగార్జునరెడ్డి మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు గతంలో పేర్కొన్న విషయం విధితమే.

ఈ నేపథ్యంలో సైఫ్ విషయం తనకు చెప్పకుండా, ప్రిన్సిపాల్‌కు చెప్పడంపై నాగార్జునరెడ్డి ప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ప్రీతి మరింత కుంగిపోయిందని, నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. తన పరిధిలోని డిపార్ట్‌మెంట్‌లో ఓ సీనియర్‌‌ స్టూడెంట్‌, జూనియర్‌‌ అమ్మాయిని నెలల తరబడి వేధిస్తున్నా నాగార్జునరెడ్డి పట్టించుకోకపోవడంపై సర్కార్ అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను భూపాలపల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Next Story