Minister Ponnam : ఏ ఒక్క ఓటు మిస్ కావద్దు : మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-23 10:44:01.0  )
Minister Ponnam : ఏ ఒక్క ఓటు మిస్ కావద్దు : మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(MLC Elections) ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి పి. విశ్వనాథన్ హాజరయ్యారు.

సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు ఇదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాని గ్రాడ్యూయేట్స్ ను కోరారు. ఏ ఒక్క ఓటు మిస్ కావద్దని.. అన్ని ఓట్లు మన అభ్యర్థికే ప్రథమ ప్రాధాన్యతగా పడాలని అభ్యర్థించారు. గ్రామాల వారిగా పట్టభద్రుల ఓట్లు ఎన్ని సాధిస్తారు..ఎలా వారిని ఓటు వేయించాలి తదితర వాటిపై ఈ సమావేశంలో అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలను కొనసాగిస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడంలో చిత్తశుద్ధిత పనిచేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలిచ్చామన్న సంగతి మరువరాదన్నారు. ఇంకా అనేక విభాగాల్లో ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపడుతున్నామని...పోటీ పరీక్షలు వరుసగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అటు పెట్టుబడుల సమీకరణ..పారిశ్రామిక రంగ విస్తరణ ద్వారా కూడా వేలాది ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగ కల్పన ప్రయత్నాలకు మద్ధతుగా పట్టభద్రులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పొన్నం కోరారు.

Next Story

Most Viewed