కడెం ప్రాజెక్టు హరిత హోటల్‌ను ప్రైవేటుకు ఇవ్వొద్దు: సీఎంకు చాడ వెంకట్‌రెడ్డి లేఖ

by Shiva |   ( Updated:2024-06-27 14:48:14.0  )
కడెం ప్రాజెక్టు హరిత హోటల్‌ను ప్రైవేటుకు ఇవ్వొద్దు: సీఎంకు చాడ వెంకట్‌రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టు వద్దనున్న హరిత టూరిజం హోటల్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వకుండా టూరిజం కార్పోరేషన్‌ నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లుగా తెలిపారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలం, స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాలలో ప్రభుత్వం భూమి ఇచ్చి హరిత టూరిజం హోటల్స్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. హోటళ్లను నడుపుటకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని, హరిత హోటల్స్‌ అన్ని లాభాల బాటలోనే నడుస్తున్నాయని అన్నారు.

అందులో నిర్మల్‌ జిల్లా, కడెం ప్రాజెక్టు వద్దనున్న హరిత టూరిజం హోటల్‌ కూడా లాభాల బాటలోనే నడుస్తుందని గుర్తు చేశారు. ఆ హోటల్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి కొంతమంది అధికారులు, బయటి వ్యక్తులతో కుమ్మకై ప్రైవేట్‌ పరం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆ విషయంపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వానికి టూరిజం తరుఫున నడుస్తున్న హోటల్స్‌ను ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన ఉంటే, అలాంటి ఆలోచనను విరమింప చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో అవసరమైన పర్యాటక ప్రాంతాలలో నూతనంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేయాలని చాడ వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Advertisement

Next Story

Most Viewed