రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా? లేక సీఎం కళ్లు కప్పి చేస్తున్నారా?.. మరోసారి తెరపైకి బీఆర్ఎస్ ఎంపీ సాయి సింధు హాస్పిటల్

by Prasad Jukanti |
రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా? లేక సీఎం కళ్లు కప్పి చేస్తున్నారా?.. మరోసారి తెరపైకి బీఆర్ఎస్ ఎంపీ  సాయి సింధు హాస్పిటల్
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్ కు సంబంధించిన భూముల లీజు వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్ పక్కన నిర్మిస్తున్న సింధు హాస్పిటల్ కోసం గత ప్రభుత్వం లీజ్ కు ఇచ్చిన 15 ఎకరాల భూమి లీజుని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో లీజుకు సంబంధించిన జీవో 140ని నిలిపివేస్తూ జీవో 12 విడుదల చేసింది. దీంతో సింధు హాస్పిటల్ గేటు బయట ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల ఆ బిల్డింగ్ లో రాత్రి వేళలో పనులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమికి సంబంధించిన లీజును ప్రభుత్వం రద్దు చేశాక కూడా ఈ బిల్డింగ్ లోపల లైట్లు వేసి రాత్రిపూట పనులు చేపడుతుండటం కొత్త చర్చకు దారితీస్తోంది. రాత్రిపూట అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ భూమి లీజును ప్రభుత్వం రద్దు చేసిందా? లేక మళ్లీ అనుమతి ఇచ్చిందా? ఈ పనులు అసలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా? ఇక్కడ పనులు జరుగుతున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసులో ఉందా? లేక ముఖ్యమంత్రి కళ్ళు కప్పి ఎవరైనా మళ్లీ పనులకు ఎవరైనా అనుమతించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా క్యాన్సర్‌, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్‌ నిర్మించేందుకు సాయిసింధు పౌండేషన్ కు హైటెక్ సిటీ-కూకట్ పల్లి ప్రధాన రహదారికి చేరువలో విలువైన 15 ఎకరాల భూమిని 30 ఏండ్ల కాలానికి ప్రభుత్వం భూమిని లీజుకు ఇచ్చింది. ఏటా రూ.1,47,743 ఫీజు ను ఫౌండేషన్‌ చెల్లించేలా నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ హయాంలో జీవో 140ని జారీచేసింది. ఇందులో ఇప్పటికే భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ లీజు వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 140 నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వగా తాజాగా అందులో రాత్రిపూట పనులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నమైన రకాల చర్చ జరుగుతోంది.



Advertisement

Next Story

Most Viewed