- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ‘డాక్టర్స్’.. మొత్తం ఎంతమంది గెలిచారంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి ఎక్కువ మంది డాక్టర్లు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచే ఉండడం గమనార్హం. డోర్నకల్ నుంచి రామచందర్ నాయక్, అచ్చంపేట నుంచి డాక్టర్ వంశీకృష్ణ, మహబూబ్ బాద్ నుంచి మురళి నాయక్, మానకొండూరు నుంచి డాక్టర్ సత్యనారాయణ కాంగ్రెస్ తరపున గెలుపొందారు. అయితే వీరంతా ఎంఎస్ జనరల్ సర్జన్స్ కావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన మెదక్ - మైనంపల్లి రోహిత్ (ఎంబీబీఎస్), నారాయణపేట్ - డాక్టర్ పర్నికా రెడ్డి (జనరల్ ఫిజిషీయన్), నారాయణఖేడ్ - సంజీవ్ రెడ్డి (పిడియాట్రిషన్), చెన్నూరు - డాక్టర్ వివేక్ వెంకటస్వామి (ఎంబీబీఎస్), నాగర్ కర్నూల్ – డాక్టర్ కూచుకుళ్ల రాజేష్, నిజామాబాద్ రూరల్ – డాక్టర్ భూపతి కూడా వైద్యులే. దీంతోపాటు బీజేపీ నుంచి సిర్పూరులో గెలిచిన పాల్వాయి హరీశ్ (ఎంఎస్ ఆర్థో), భద్రాచలం బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ సంజయ్ కూడా డాక్టర్లే కావడం గమనార్హం.