అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ప్రవీణకు డాక్టరేట్

by GSrikanth |
అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ప్రవీణకు డాక్టరేట్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ SRR డిగ్రీ కళాశాలలో రాజనీతిశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిలువేరి ప్రవీణకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేసింది. ఓయూ ప్రొఫెసర్ లక్ష్మి పర్యవేక్షణలో ‌'ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఏ కేస్ స్టడీ ఇన్ హైదరాబాద్' అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు గాను గురువారం ఆమెకు డాక్టరేట్ ప్రకటించారు. దీంతో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తదితరులు ప్రవీణను అభినందించారు.

Advertisement

Next Story