- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానం నాగేందర్ ను చేర్చుకోవద్దు.. గాంధీ భవన్ వద్ద ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో:ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ పలువురు గాందీ భవన్ ఎదుట ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. దానం నాగేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దానం నాగేందర్ భూకబ్జాదారుడని అతనిడి కాంగ్రెస్ పార్టీలో చేరుకోవద్దని నినాదాలు చేశారు. కాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని దానం నాగేందర్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
గతంలో కాంగ్రెస్ లో ఉన్న దానం నాగేందర్ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతర రాజకీయ పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ కు జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆయన హస్తం గూటికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని అందులో భాగంగానే ఎల్లుండి పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. పార్టీలో చేరితే సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతలో ఆయన్ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ మహిళలు ఆదోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.