ఆ యాప్స్ జోలికి వెళ్లకండి.. తెలంగాణ పోలీసుల అలర్ట్

by Prasad Jukanti |
ఆ యాప్స్ జోలికి వెళ్లకండి.. తెలంగాణ పోలీసుల అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. లోన్ ఇచ్చేప్పుడు తియ్యటి మాటలతో పలకరించే నిర్వాహకులు వసూలు సమయంలో మాత్రం తమ అసలు రంగు బయట పెడుతున్నారు. వారి ఆగడాలను భరించలేక ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సందేశం జారీ చేశారు. లోన్ యాప్స్ జోలికి వెళ్లవద్దని అలర్ట్ చేశారు. లోన్ యాప్స్ లో అప్పు తీసుకుని మన అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేసినా ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ మన పాలిట శాపంగా పరిణమిస్తుందని హెచ్చరించారు. లోన్ యాప్ అప్పులు మన జీవితాన్ని అంధకారంలో నెడుతాయని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ వేదికగా అప్రమత్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed