- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేరే కాలేజీల్లో అడ్జస్ట్ చేయండి.. ఇంటర్ విద్య డైరెక్టర్‌కు వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల జరిగిన బదిలీల్లో డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్స్ ను వేరే కళాశాలలో నియమించాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ విద్య డైరెక్టర్ శృతి ఓజాకు ఆన్ లైన్ విధానంలో వినతి అందజేశారు. జీవో నంబర్ 80, 118 ప్రకారం ప్రభుత్వ ఇంటర్ విద్యలో నిర్వహించిన అధ్యాపకుల బదిలీల వల్ల కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇబ్బందులు తలెత్తాయని, అందుకే వారిని ఇతర కళాశాలలో అడ్జస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 1300 పైగా గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ జూలై 31తో ముగిసిందని వారు వివరించారు. చాలా కళాశాలలో అధ్యాపకుల కొరతతో విద్యార్థులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని, అందుకే వారి రెన్యువల్ కాల పరిమితి కూడా పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 , రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సురేష్ డిమాండ్ చేశారు.