- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాస్పదంగా మారిన మేడారం బెల్లం పంపిణీ.. స్పందించిన వీహెచ్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మత రాజకీయాలను నమ్ముకున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మక జాతర అయిన మేడారం బెల్లం పంపిణీని రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. భక్తి భావనతోనే మేడారం బెల్లం పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు కేంద్రంలో పదేళ్లు అవకాశం ఇచ్చినా.. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేయడం మానలేదని అన్నారు. కులాలు, మతాల పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు.
తెలంగాణలో ఈ సారి బీజేపీకి చేదు అనుభవం తప్పదని అన్నారు. ఒకటి, రెండు సీట్లకు పరిమితం అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. మరోవైపు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను అడవుల్లో వేయవద్దని, పరిశుభ్రత పాటించాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.