డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తుల నివారణపై అవగాహన..

by Vinod kumar |
డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తుల నివారణపై అవగాహన..
X

దిశ, తెలంగాణ బ్యూరో: విపత్తులు సంభవించినపుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలపై జిహెచ్ఎంసి, డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గురువారం ఈస్ట్ మారేడ్పల్లి అడ్డగుట్ట లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిర్వహించే రెస్క్యూ ఆపరేషన్‌లలో వినియోగించే వస్తువులను విద్యార్థులకు చూపించారు.


అనంతరం వాటిని వినియోగించి తమను తాము, అలాగే పొరుగు వారిని కాపాడుకునే ఉపాయాలను విద్యార్థులకు నేర్పించారు. అధికారులు ఎస్ఎఫ్ఓ శ్యామ్ సుందర్ రెడ్డి, డీఆర్ఎఫ్ మేనేజర్ మురళి ముఖ్యంగా విపత్తులు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీను, శ్రావణ్ రాజ్, భాను కుమార్, సాగర్, జైపాల్, స్కూల్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed