- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సర్కారు మెడకు సమస్యల ఉచ్చు
ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కొద్దీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారుకు ఇంటా బయట సమస్యలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం మొదలు పేపర్ లీకేజీ వ్యవహారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాలనా అంశాలు సైతం తలనొప్పిగా మారాయి. పోడు పంచాయితీకి పరిష్కారం దొరకలేదు. రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. మరో వైపు ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ టైంలో పార్టీలో అసంతృప్తి సెగలు బయట పడతాయనే గుబులు పట్టుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కోవడం బీఆర్ఎస్‌కు మింగుడుపడటం లేదు. కవిత తొలిసారి ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు జరిగిన ఆందోళనలు కేవలం పార్టీ లీడర్లకే పరిమితమయ్యాయి. ప్రజల నుంచి అనుకున్న మేరకు స్పందన రాలేదు. మొన్నటి వరకు విచారణను ఎదుర్కుంటానని ధీమాగా చెప్పిన కవిత ఇప్పుడు ఈ ఇష్యూపై సుప్రీం కోర్టుకు వెళ్లడం ఏంటని పార్టీ లీడర్లే పెదవి విరుస్తున్నారు.
పరువు తీసిన పేపర్ లీక్..
తాజాగా మూడు ఉద్యోగాలకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో ప్రభుత్వ పరువు పోయింది. రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు కింది స్థాయి ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లే వరకు సర్వీస్ కమిషన్ సెక్రెటరీ, చైర్మన్ ఎందుకు పసిగట్టలేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎవరూ స్పందించలేదు. కేవలం సిట్ విచారణ వేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
దారిలో పడని ధరణి, మొదలుకాని పోడు పట్టాలు..
ధరణి పోర్టల్ సమస్య ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. సమస్యలు పరిష్కరించాలని రైతుల నుంచి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వీటిని ఎలా, ఎప్పుడు పరిష్కరించాలి?అనే అంశంపై ఆఫీసర్లకు క్లారిటీ రావడం లేదు. సీఎం కేసీఆర్ రివ్యూ చేసి ఏమైన ఆదేశాలు ఇస్తారేమోనని అధికారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ ఎప్పుడు, ఎంత మందికి ఇస్తారు? అనే దానిపై క్లారిటీ లేదు.
రుణమాఫీ పై ఒత్తిడి..
2018 ఎన్నికల్లో లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇంత వరకు రూ.25 వేల లోపు ఉన్న రుణాలనే మాఫీ చేశారు. మిగతావి మాఫీ చేయాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ రుణమాఫీ చేయకుండా ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని పార్టీలో ఆందోళన నెలకొంది.
విపక్షాల ఆందోళనలు ఉధృతం..
ప్రధాన విపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మీల, కోదండరామ్ నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యపై ఆందోళనలు చేస్తున్నారు. దీనికి తోడు పేపర్ లీక్‌పై నిరుద్యోగులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు.
అసమ్మతి కుంపట్లు..
పార్టీ పరంగా బీఆర్ఎస్‌కు అసమ్మతి సెగలు రేపుతున్నది. జనవరిలో మున్సిపల్ మేయర్లు, చైర్ పర్సన్స్‌పై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. వీటిపై కోర్టులో స్టే రావడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించింది. కానీ అక్కడ ఇంకా అసమ్మతి రగులుతూనే ఉన్నది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పొసగడం లేదు. కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నాయి. ఇంకొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దని లోకల్ లీడర్లు హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనాలపై ఆ పార్టీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది.