రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రియల్టర్ల ధర్నా..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-24 11:47:18.0  )
రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రియల్టర్ల ధర్నా..
X

దిశ, మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంచర్‌లలో ఉన్న ప్లాట్ల క్రయ విక్రయాలు జరగకుండా(రిజిస్ట్రేషన్) నిలుపుదలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రియల్టర్లు ధర్నా చేపట్టారు. రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు గంట పాటు ధర్నా చేశారు. అనంతరం రిజిస్టార్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ లేఔట్‌లో ఉన్న ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదని 20‌20 ఆగస్టు 26న రాష్ట్ర స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాష్ట్రం‌లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు మెమో జారీ చేశారన్నారు.

అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల నిలుపుదల చేయడంతో వెంచర్లు వేసిన రియల్టర్లు, రైతులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారని గుర్తుచేశారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయానికి కూడా గండి పడుతోందన్నారు. ఇది ఇలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా నిబంధన ప్రకారం వెంచర్లు, లేఔట్లు లేవన్నారు. వెంచర్లు వేసిన రియల్టర్లు స్థానిక గ్రామపంచాయతీకి పదిశాతం స్థలాన్ని గ్రామపంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని రిజిస్ట్రేషన్ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ జీ తమకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు రిజిస్ట్రేషన్లపై ఎం చెప్పలేం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed