ఫిలిం ఛాంబర్ ఎదుట ‘లైగర్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 06:57:25.0  )
ఫిలిం ఛాంబర్ ఎదుట ‘లైగర్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చేస్తున్న ధర్నాతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోట్ల రూపాయలు పెట్టి లైగర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామని, అయితే భారీగా నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చెబుతున్నారు. దీంతో తాము రోడ్ల మీదకు వచ్చామని తెలిపారు. గతంలో లైగర్ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమను ఆదుకుంటామని చెప్పారన్నారు. అయితే, ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం చెయ్యలేదన్నారు. అందుకే ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. న్యాయం జరిగే వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: ప్రియాంక ‘మిస్ వరల్డ్’ అందుకున్నప్పుడు భర్త వయసు ఎంతో తెలుసా?

ఆ క్యారెక్టర్ నన్ను భావోద్వేగానికి గురిచేసింది.. చాలా ఏడ్చేశా

Advertisement

Next Story

Most Viewed