ప్రజా భవన్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా

by Y. Venkata Narasimha Reddy |
ప్రజా భవన్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : దళిత బంధు పథకం లబ్ధిదారులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్ ముందు ధర్నా నిర్వహించారు. వచ్చే వారం జరిగే కేబినెట్ భేటీలో దళిత బంధు నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్. పంచాయతీ ఎన్నికల లోపు దళిత బంధు నిధులను విడుదల చేస్తామని హామీ ఇవ్వకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. దళితబంధు పథకానికి ఎంపికైనా లబ్దిదారులు ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పథకం అమలుపై అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబంధు పథకం రెండో విడతలో నియోజకవర్గానికి 11 వందల మంది చొప్పున 5500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం విదితమే.

అయితే, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దళితబంధు పథకంపై స్టేటస్ కో పాటిస్తుంది. దళితబంధు పథకం అమలు చేస్తారా? లేదా? అన్నదానిపై లబ్ధిదారులలో గందరగోళం ఏర్పడింది. మొదటి విడతలో దళితబంధు పథకంలో జిల్లాలోని 500ల మంది లబ్దిదారులను ఎంపిక చేసి రూ. 50 కోట్లను నిధులను ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించగా, పథకం అమలులో భారీగా అక్రమాలు జరిగాయన్న విమర్శలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed