- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో బీర్ల ధరల వివరాలివే!

దిశ, వెబ్‌డెస్క్: వేసవి(Summer) వేళ తెలంగాణలో మందు బాబులకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అనూహ్యంగా బీర్ల ధరలను(Beer Prices) 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లో ఉంటాయని పేర్కొనడంతో మద్యం ప్రియులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ(Telangana Excise Department) అధికారులు అంచనా వేస్తున్నారు.
ధరల వివరాలు:
లైట్ బీరు రూ.150 ఉండగా.. రూ.172.5కి పెంపు
కేఎఫ్ ప్రీమియం రూ.160 నుంచి రూ.184కి పెంపు
బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241.5 కి పెంపు
కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ రూ.220 నుంచి రూ.253కి పెంపు
బడ్వైజర్ మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కి పెంపు
టూబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కి పెంపు
మరోవైపు.. ప్రభుత్వం ధరలు పెంచడంపై మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీర్ల కంపెనీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గొద్దని మండిపడుతున్నారు. ప్రతీ సారి సరిగ్గా ఎండకాలం రాగానే ధరలు పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.