Bhatti Vikramarka: నిన్న కేటీఆర్ నేడు డిప్యూటీ సీఎం.. మనోహర్ లాల్ ఖట్టర్ తో భట్టి ప్రత్యేక సమావేశం

by Prasad Jukanti |
Bhatti Vikramarka: నిన్న కేటీఆర్ నేడు డిప్యూటీ సీఎం.. మనోహర్ లాల్ ఖట్టర్ తో భట్టి ప్రత్యేక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశం సమర్థవంతమైన సుస్థిరమైన ఇంధన భవిష్యత్తు సాధించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక ఇంధనాన్ని మెరుగుపరచడంపై తెలంగాణ దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సు (Power Ministers Conference)కు ఆయన హాజరయ్యారు. ఆయనతో పాటు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ తో భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమైమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యుత్ సంబంధిత అంశాలను చర్చించారు.

నిన్న కేటీఆర్.. నేడు భట్టి..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టన్ ను కలిసి అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన 24 గంటలు గడవకముందే అదే కేంద్ర మంత్రితో భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వీరి మధ్య కేటీఆర్ ఫిర్యాదుకు సంబంధించిన ప్రస్తావన ఏదైనా వచ్చిందా లేక కేవలం రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ అంశాలపైనే మాట్లాడుకున్నారా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed