Deputy CM Bhatti: భట్టితో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటి.. తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం

by karthikeya |   ( Updated:2024-10-26 08:43:42.0  )
Deputy CM Bhatti: భట్టితో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటి.. తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం
X

దిశ. వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల (Employees JAC)తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) భేటీ ముగిసింది. హైదరాబాద్ ప్రజా భవన్ (Praja Bhavan) లో జరిగిన ఈ భేటీ జరిగింది. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన 3 పెండింగ్ డీఏలు (Pending DA), ఈ ప్రభుత్వంలో రావాల్సిన 2 డీఏలను వెంటనే రిలీజ్ చేయాలని డిప్యూటీ సీఎంను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కాగా.. ఉద్యోగుల డిమాండ్లపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. డీఏల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై చర్చించి, కనీసం ఓ డీఏ అయినా ఈ రోజు ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. కాగా.. 2022 జనవరి డీఏ (DA) ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం సీఎంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయి ఇదే విషయాన్ని వెల్లడించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామని, ఆ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఉంటారని ప్రకటించారు.

Advertisement

Next Story