‘బీ అలర్ట్’.. విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశం..!

by Satheesh |
‘బీ అలర్ట్’.. విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అతి త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం వంటి సంఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నదని, సరఫరాలోను ఎలాంటి అంతరాయం తలెత్తకుండ చర్యలు చేపట్టాలని అన్నారు. లైన్స్ క్లియరెన్స్ విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్‌సీలు ఇవ్వడానికి వీలు లేదన్నారు. ఎల్‌సీ తీసుకుంటున్న సమయంలోను స్థానికంగా ఉన్న వినియోగదారులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలన్నారు. ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి లైన్ మెన్ వరకు అప్రమత్తతో, నిరంతరం సమీక్షలు చేసుకుంటూ సమన్వయం కావాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్ కో జేఎమ్ డీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed