పదేళ్లలో తెలంగాణను విధ్వంసం చేశారు: భట్టి విక్రమార్క

by GSrikanth |
పదేళ్లలో తెలంగాణను విధ్వంసం చేశారు: భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో తెలంగాణలో విధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారింది.. ప్రజలు తీర్పు ఇచ్చారు.. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సభను నడిపేందుకు సహకరించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై శనివారం సభలో మాట్లాడారు. సూచనలను కొంత పెద్దమనసుతో స్వీకరిస్తామన్నారు. మొదలు పెట్టుడే దాడిచేయడం మొదలు పెడితే సమాధానంపైనే చర్చజరుగుతుందన్నారు. నీళ్లు ఇవ్వలేదు.. వలసలు పోయారని మాట్లాడటం సరికాదని 70శాతం తాగునీరిచ్చామన్నారు. 42వేల కోట్లతో గోండుగూడాలకు సైతం తాగునీరిచ్చామన్నారు. ఆర్ డబ్ల్యూఎస్ కింద ట్యాంకులు నిర్మిస్తే ధ్వంసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామన్నారు.

55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని, ఏం చేయలేదు కాబట్టే అది వద్దనుకొని ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సకలజనుల సమ్మే చేశామని, మేముకూడా ఉద్యమంలో భాగస్వాములం అయ్యామన్నారు. మిగులు సంపదతో రాష్ట్రం ఏర్పడితే అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. పాతదికాదు తెలంగాణ వచ్చిన దగ్గరనుంచి మాట్లాడుకుందామన్నారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టి గోదావరి నుంచి చుక్కనీరు తేలేదని విమర్శించారు. ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. గత కాంగ్రెస్ పాలన గురించి కాదని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందామన్నారు. ఆనాటి శాసనసభ కాదన్నారు. వాళ్లతో పోటీపడదామంటే నువ్వు అటుపో.. ఇక్కడ ఎందుకు అని చమత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed