పోడు రైతులకు డిప్యూటీ CM భట్టి శుభవార్త

by GSrikanth |
పోడు రైతులకు డిప్యూటీ CM భట్టి శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: పోడు రైతులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. శనివారం భట్టి విక్రమార్క సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వందశాతం కృషి చేస్తామని అన్నారు. తమది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని.. మరో రెండు పథకాలను ఈ నెల 27వ తేదీన అమలు చేస్తామని ప్రకటించారు.

చేవెళ్లలో కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ సమక్షంలో రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. త్వరలో పోడు రైతులకు పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్ల పాలెంలో చేపట్టిన యాదాద్రి అల్ట్రా మెగా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వైటీపీఎస్‌ పనుల పురోగతిని పరిశీలించారు. వైటీపీఎస్‌‌లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో సెప్టెంబర్ నాటికి రెండు యూనిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed