Bhatti Vikramarka: కాంగ్రెస్‌లో మంత్రులంతా పని మంతులే.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్

by Gantepaka Srikanth |
Bhatti Vikramarka: కాంగ్రెస్‌లో మంత్రులంతా పని మంతులే.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) అత్యధిక మెజార్టీతో గెలిచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధులో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గెలిచిందని అన్నారు. మహారాష్ట్రలో EVM టాంపరింగ్ గురించి నాకు తెలియదు.. అక్కడికి నేను వెళ్ళలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని బలహీన పరచాలని బీజేపీ చేస్తున్న కుట్రను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంపులో సైంటిఫిక్‌గా రూపొందించాలని సుప్రీం చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో చర్చిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు త్వరలో భూమి పూజలు ఉంటాయని కీలక ప్రకటన చేశారు.

రైతుభరోసా కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని అన్నారు. 12 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని అన్నారు. రేషన్ కార్డు(Ration card)లు ఇవ్వకుండ పదేళ్లు కాలక్షేపం చేసిన బీఆర్ఎస్(BRS) ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. నాలుగేళ్లలో 4 విడుతలుగా లక్ష రుణమాఫీ చేస్తే.. వడ్డీ భారంగా మారిందని అన్నారు. ఉద్యోగుల జీతాలు, అప్పులకు వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందని అన్నారు. ప్రజలను మతాల పేరిట విడగొట్టింది బీజేపీ(BJP) అని విమర్శించారు. కుల గణన నివేదిక వచ్చాక చర్చ చేసి ఏది మంచో అది చేద్దామని చెప్పారు. కేటీఆర్ కొన్ని రోజులుగా ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

సీఎం, ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు వందరోజుల్లో అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రతీ మంత్రి పని మంతుడే అని చెప్పారు. వాళ్ల లాగే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను స్వతహాగా ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుందని.. నిన్నటి పర్యటనలో కేబినెట్ విస్తరణ మీద చర్చ జరగలేదని వెల్లడించారు. మూసీ బాధితులకు అన్ని విధాల అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed